Kailash Satyarthi Green India Challenge : "పచ్చని ప్రపంచం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్" - గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇన్ కైలాస్ సత్యార్థి
🎬 Watch Now: Feature Video
Kailash Satyarthi participate Green India Challenge : నోబెల్ శాంతి బహుమతి గ్రహిత కైలాష్ సత్యార్థి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ కలిసి గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అధ్వర్యంలో ప్రకృతి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకు వచ్చిన వృక్షవేదం, హరితహారం పుస్తకాలను కైలాస్ సత్యార్థికి అందించి సత్కరించారు. పచ్చని ప్రపంచం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని కైలాస్ సత్యార్థి అన్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం భవిష్యత్ తరాల బాగు కోసం పనిచేయడం గొప్ప విషయమని.. ఈ నేలను సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు నాయకులుగా మారితే ప్రపంచం సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. ఆ కోవలో ప్రథముడు జోగినిపల్లి అంటూ సంతోష్‌కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6.0” ప్రారంభంలోనే కైలాష్ సత్యార్థి లాంటి గొప్ప వ్యక్తి పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషమని సంతోష్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల ఉద్యమకారులందరికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేరువవుతుందన్నారు.