తొమ్మిదిన్నరేళ్ల అస్తవ్యస్త పాలనను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం : మంత్రి జూపల్లి - పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 10, 2023, 10:45 PM IST
Jupally Krishna Rao Take Charge on Tourism and Excise Minister : తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజు ఎంత సంతోషంగా ఉందో ఇవాళ అంతకంటే రెట్టింపు సంతోషం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలను జూపల్లి కృష్ణారావు స్వీకరించారు. నీళ్లు, నిధులు, నియామకంతో పాటు ఆత్మగౌరవం ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియంత పాలన, డిక్టేటర్ పాలనగా చేశారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం ప్రజలు తీర్చుకున్నారని తెలిపారు. రాబోయే కాలంలో గత పరిపాలన కంటే, కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేశారు. తమ పాలనలో స్వచ్ఛమైన, ప్రజా పాలన ఉంటుందని తెలియజేశారు.
Minister Jupally Krishna Rao : ప్రజలకు వంద శాతం న్యాయం చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు మాటిచ్చారు. తాజాగా జరిగిన పర్యాటక శాఖలో అగ్నిప్రమాదంపై విచారణ చేసి తొందరగా రిపోర్టు నివేదికను అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్త పాలనను తాము చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఏది చేసినా తెలంగాణ ప్రజా క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.