ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల నిరసన - డైరెక్టర్‌ను తొలగించాలంటూ డిమాండ్ - రిమ్స్‌లో ప్రొఫెసర్‌పై వైద్యుల నిరసన
🎬 Watch Now: Feature Video
Published : Dec 15, 2023, 7:56 PM IST
|Updated : Dec 15, 2023, 10:30 PM IST
Junior Doctors Protest At Rims : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు రెండో రోజు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. విధులు బహిష్కరించి డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ ఛాంబర్ ఎదుట బైఠాయించి శాంతియుత ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ వైద్య ఆసుపత్రి నుంచి ప్రొ.శివప్రసాద్, డా.వీవీ రావుల బృందం రిమ్స్ చేరుకుని విచారణ చేపట్టింది. డైరెక్టర్‌తో సహా జూనియర్ డాక్టర్లను వేర్వేరుగా విచారించారు. ప్రభుత్వానికి తమ నివేదికను అందజేస్తామని విచారణ బృంద సభ్యులు తెలపగా డైరెక్టర్‌ను తొలగించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. క్రాంతి కుమార్ సహా మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులు కారును వేగంగా నడుపుతూ గురువారం రాత్రి విద్యార్థుల హాస్టల్ ఆవరణలోకి దూసుకెళ్లడం గొడవకు కారణమైంది. విద్యార్థులు- ప్రైవేటు వ్యక్తుల మధ్య తీవ్రఘర్షణ చోటుచేసుకోవడం పరస్పర దాడులకు దారితీసింది. వైద్య విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడంతో కలెక్టర్ రాహుల్‌రాజ్ విచారణ కమిటీని నియమించారు.