Jubilee Hills MLA PA Arrest in Attack Case : వ్యక్తిని చితకబాదిన ఎమ్మెల్యే గోపీనాథ్ పీఏ.. అరెస్ట్ చేసిన పోలీసులు - జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గొడవ కేసులో పీఏ అరెస్ట్
🎬 Watch Now: Feature Video
Published : Oct 11, 2023, 2:22 PM IST
Jubilee Hills MLA PA Arrest in Attack Case : జూబ్లీహిల్స్‌లోని ఎల్.ఎన్ నగర్‌లో ఒక వ్యక్తిని చితకబాదిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు.. బాధితుడిపై దాడి చేసిన భాస్కర్, లలిత్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ భాస్కర్ శనివారం అర్ధరాత్రి మరికొంతమందితో కలిసి ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. 'కృష్ణా నగర్‌లో శనివారం అర్ధరాత్రి చందు అనే వ్యక్తి ఒక మహిళతో మాట్లాడుతున్నారు. వాళ్లిద్దరిని లలిత్ అనే వ్యక్తి ఆ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించగా.. చందు, లలిత్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో లలిత్‌ను కింద నెట్టేయగా.. అతను తన స్కూటీతో సహా కిందపడిపోయాడు. కోపానికి గురైన లలిత్ తన ఫ్రెండ్స్‌ని తీసుకొని వచ్చాడు. ఇందులో భాస్కర్ తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి చందుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరిని అరెస్ట్ చేశాం. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నాం' అని సీఐ తెలిపారు.