JP Nadda on Lashkar Bonalu : 'తెలంగాణ అభివృద్ధి బాటలో నడవాలని అమ్మవారిని కోరుకున్నా' - JP Nadda at Ujjaini Mahankali Bonalu Festival
🎬 Watch Now: Feature Video
JP Nadda at Ujjaini Mahankali Bonalu Festival : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అషాడమాసంలో జరిగే ఈ ఉత్సవాల్లో ఎందరో రాజకీయ ప్రముఖులు, సినీతారలు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన జేపీ నడ్డా.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. రాష్ట్ర ప్రజలు ఆకాంక్షను తీర్చాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఆయన వెంట కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్దితో పాటు ముఖ్య నేతలు ఉన్నారు. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 11రాష్ట్రాల అధ్యక్షులు, ఎన్నికల ఇంఛార్జ్లు, కీలక నేతలతో నడ్డా సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం గురించి చర్చించారు.