బీజేపీ అధికారంలోకి వస్తే - ఏడాదికి 4 గ్యాస్​ సిలిండర్లు ఫ్రీ : జేపీ నడ్డా - మోదీ మన్​ కీ బాత్ కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 1:08 PM IST

JP Nadda fires on BRS : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్​కు ఏటీఎంలా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్​లో ఆయన పర్యటించారు. రాష్ట్రంలో డబుల్​ బెడ్​ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట తప్పారని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని.. తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు.

ప్రతి బీఆర్​ఎస్ ఎమ్మెల్యే అవినీతి పరుడని.. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని నడ్డా ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయని.. తెలంగాణ సర్కారు ప్రజలను మోసం చేసిందని,  కాంగ్రెస్ పార్టీ అవినీతిమైందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాఫెల్, కామన్​వెల్త్, 2జీ, 3జీ పేరుతో అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద.. 4 కోట్ల ఇళ్లు నిర్మించామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఉజ్వల యోజన పథకం కింద ప్రతి ఏడాది ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎరువులు సబ్సిడీకి అందిస్తామన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.