Jeevan Reddy,Telangana Election Results 2023 Live : 'తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం - మార్పు కోరుకున్న ప్రజలు' - Jagtial Telangana assembly elections result 2023
🎬 Watch Now: Feature Video
Published : Dec 3, 2023, 12:01 PM IST
Jeevan Reddy,Telangana Election Results 2023 : రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల అభ్యర్థి ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. అందుకే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ 85 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ఆత్మగౌరవం కోసం తెలంగాణను తెచ్చుకున్నామని.. దాన్ని నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.కేసీఆర్ కుటుంబ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని అందుకే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలియజేశారు. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మారని వెల్లడించారు.
Jagtial Election Results 2023 Live : తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందగా.. ఈ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిపై జీవన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.