Janareddy fires on BRS : "తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేది.. కాంగ్రెస్ పార్టీయే" - telangana congress latest news
🎬 Watch Now: Feature Video
Published : Oct 22, 2023, 9:41 PM IST
Janareddy fires on BRS : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉన్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ జానారెడ్డి వెల్లడించారు. కొల్లాపూర్ టికెట్ తనకు రాలేదని తీవ్ర అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమైన.. జగదీశ్వరరావును కాంగ్రెస్ బుజ్జగించింది. జానారెడ్డితో పాటు.. కాంగ్రెస్ పెద్దలు మాట్లాడి ఆయనను సముదాయించారు. జగదీశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని.. ఆయన సేవలను కాంగ్రెస్ వినియోగించుకుంటుందన్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావుతో కలిసి పని చేసి.. కాంగ్రెస్‌ను గెలిపించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.
Janareddy Comments on KCR : రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన జానారెడ్డి.. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటి వరకు చేసిన వాగ్దానాలను పక్కన పెట్టి.. ఇప్పుడు తిరిగి కొత్త హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ, ఆహార భద్రత, అటవీ హక్కులు లాంటి పథకాలను తీసుకొచ్చింది.. కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. సోనియాగాంధీపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.