మంచులో కశ్మీర్ యువతుల మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. అదే కారణమట - మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్
🎬 Watch Now: Feature Video
ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రతీ రంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ కోవకు చెందిన జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాకు చెందిన కొందరు యువతులు.. మంచులోనే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇండోర్‌లో ప్రాక్టీస్ చేయడానికి సౌకర్యాలు లేకపోవడమే ఇలా చేస్తున్నామని వారు తెలిపారు. దేశాన్ని, తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తామని యువతులు అంటున్నారు. మన పిల్లలను అంతర్జాతీయ వేదికలు, ఒలింపిక్స్‌కు తీసుకెళ్లాలని కోచ్ సుజాత్ అన్నారు. క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాను ఆయన అభ్యర్థించారు.
Last Updated : Feb 6, 2023, 4:07 PM IST