లైవ్ వీడియో.. CRPF వ్యాన్‌పైకి దూసుకొచ్చిన లారీ.. ఇద్దరు జవాన్లకు గాయాలు - jammu kashmir accident latest
🎬 Watch Now: Feature Video
అదుపు తప్పిన ఓ భారీ లారీ రోడ్డుపై ఆగి ఉన్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
అవంతీపుర వద్ద జాతీయ రహదారి పక్కన సీఆర్పీఎఫ్ జవాన్లు గురువారం ఉదయం తమ వాహనాన్ని నిలిపి ఉంచారు. రోడ్డుకు అవతలి వైపున వేగంగా వెళుతున్న ఓ లారీ.. అవంతీపుర వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది. డివైడర్‌ను దాటి సీఆర్పీఎఫ్ వాహనం వైపుగా దూసుకొచ్చింది. జవాన్లు ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
గురువారం ఉదయం వర్షం కారణంగా రోడ్డు పూర్తిగా తడిచిపోయింది. తడిచిన రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ.. ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతూ అదుపు తప్పిందని పోలీసులు ప్రాథమింగా గుర్తించారు.