అధికారి మెడలో కరెన్సీ నోట్ల దండ వేసి మత్స్యకారుల విన్నూత నిరసన - జగిత్యాల కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 7:49 PM IST

Jagtial Fishermen Variety Protest : జగిత్యాల జిల్లాలో మత్స్యశాఖ అధికారి దామోదర్‌ లంచం కోసం వేధిస్తున్నారని మత్స్యకారులు విన్నూత నిరసన చేశారు. జిల్లా కలెక్టరేట్​లో మత్స్యశాఖ అధికారి మెడలో కరెన్సీ నోట్ల దండ వేసి మత్స్యకారులు నిరనస తెలిపారు. మేడిపల్లి మండలం బీమారంకు చెందిన మత్స్యకారులు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అదే సమయంలో కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలోనే మత్స్యశాఖ అధికారికి కరెన్సీ దండ వేశారు. 

Fishermen Offer Bribe Garland to Officer : జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్‌ చెరువుల సొసైటీ విషయంలో డబ్బులు డిమాండు చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపించారు. లంచం అడుగుతున్నారని ఏసీబీ దృష్టికి తీసుకెళ్తామంటే తమనే బెదిరిస్తున్నారని అన్నారు. అనంతరం తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై మత్స్యశాఖ అధికారి దామోదర్‌ స్పందించారు. తాను డబ్బులు డిమాండ్​ చేయలేదని అన్నారు. మత్స్యకారులు వాళ్లలో వాళ్లే వివాదం చేసుకొని తనపై నింద వేస్తున్నారని దామోదర్‌ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.