Jagdish Reddy: 'ప్రత్యేక రాయలసీమ.. రాయల తెలంగాణ సాధ్యమయ్యే పనికాదు'

By

Published : Apr 25, 2023, 1:50 PM IST

thumbnail

Jagdish Reddy comments on Rayala Telangana Demand: రాయల తెలంగాణ అంశంపై మంత్రి జగదీశ్​రెడ్డి స్పందించారు. ప్రత్యేక రాయలసీమ అంశం ఇప్పుడు అప్రస్తుతం అన్నారు. స్థానిక పరిపాలకుల వైఫల్యాలతోనే ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యమయ్యే పనికాదని తేల్చి చెప్పారు. 

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోవడమే.. రాయల తెలంగాణ కోరడానికి కారణమని జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మోడల్ అభివృద్ధి కోరుకుంటూ.. తెలంగాణాలో కలపాలని ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్​ నాయకత్వంలోనే స్వర్ణాంధ్ర నిర్మాణ కల సాకారమవుతుందని వెల్లడించారు. 

కేసీఆర్ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నాయకులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని వివరించారు. వెనుకబాటుకు కారణమైన నాయకత్వంపై తిరుగుబాటు చేస్తేనే స్వర్ణాంధ్ర సాధ్యమని మంత్రి జగదీశ్​రెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.