Jadi Malkapur Waterfalls : జలపాత సోయగంలో భళా.. పర్యాటక అభివృద్ధిలో డీలా - సంగారెడ్డి వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-07-2023/640-480-19067211-1054-19067211-1690023079610.jpg)
Jadi Malkapur Waterfalls In Sangareddy : ఉపరితలద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకల నుంచి వచ్చి చేరుతున్న కొత్తనీటితో నదులు, జలపాతాలు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో ఉన్న జాడి మల్కాపూర్ జలపాతాలు జీవం పోసుకున్నాయి. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం ఉదయం జలపాతం ఉప్పొంగి, జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అంతర్రాష్ట్ర సరిహద్దులోని జాడి మల్కాపూర్ జలపాతం సందర్శనకు సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, బీదర్, గుల్బర్గా, వికారాబాద్ జిల్లాల పర్యాటకులు భారీగా తరలివస్తారు. అటవీ ప్రాంతంలో భారీ గుట్టల మధ్య జలజల రావాలు చేస్తూ కనిపించే జలపాత సోయగాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం సందర్శకులను ఇబ్బందులకు గురిచేస్తుంది. కనీసం తాగునీరు దొరకని పరిస్థితి. రోడ్డు మార్గం కూడా సరిగా లేకపోవడం రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు హోటళ్లు, రాత్రివేళ ఉండేందుకు గుడారాలు, రవాణా మార్గాన్ని మెరుగుపరచాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ ప్రదేశం జహీరాబాద్ పట్టణానికి 25 కి.మీ, హైదరాబాద్కు 120 కిలోమీటర్ల దూరంలోని ఉంది.