యువ ఆవిష్కర్తల సృజనకు మెలుకువ మంత్రం - ఇంటింటా ఇన్నోవేటర్
🎬 Watch Now: Feature Video
Published : Nov 4, 2023, 6:31 PM IST
Intinta Innovator Program For Young Innovators in Telangana : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రజ్ఞ దాగి ఉంటుంది. నైపుణ్యం ఉన్నా సరైన వేదిక లేక.. వెనకడుగు వేసేవాళ్లుంటారు. ఆవిష్కర్తలలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి సరైన వేదికలో తమ ఆలోచనలను పంచుకునే అవకాశం కల్పించి.. లోటుపాట్లను చెప్పగలిగితే వారు గొప్ప ఆవిష్కర్తలు అవుతారు. దీనికోసం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ విభాగం ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఏటా ఆవిష్కర్తలను గుర్తించి.. వారికి అవసరమైన సలహాలు, సూచనలు చేయడమే కాదు.. అవసరమైన గ్రాంట్లతో పాటు మార్కెటింగ్ సహకారం కూడా కల్పిస్తున్నారు.
ఈసారి టీఎస్ఐసీ, ఏసీఐసీల సమన్వయంతో మార్కెట్ వాలిడేషన్ బూట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. సమాజంలో మన చుట్టూ ఉండే సమస్యలను చూసి స్పందించినప్పుడు వాటికి పరిష్కారం కనుక్కొనే క్రమంలో కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతకు వచ్చిన ఆలోచనలు కూడా అలాంటివే. తమ చుట్టూ ఉన్న వాళ్లు పడుతున్న ఇబ్బందులను గమనించి.. దాని పరిష్కారానికై కృషి చేస్తున్నారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన సృజనశీలురు తమ ఆవిష్కరణల గురించి వివరించారు.