Interview With TSRTC Chairman : టీఎస్ఆర్టీసీ ఉద్యోగికి ఎంత వేతనం పెరగనుంది?.. ఎప్పటి నుంచి?
🎬 Watch Now: Feature Video
Interview With TSRTC Chairman Bajireddy Govardhan : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వంలో విలీనం అయినా.. సంస్థ అలాగే ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా కార్పొరేషన్ అలాగే ఉంటుందని.. దానికి ఛైర్మన్, ఎండీ కొనసాగుతారని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కమిటీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్రాల్లో పర్యటించి.. దానిలో ఉన్న లాభాలను, నష్టాలను అంచనా వేయనుందని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తర్వాత నిజామాబాద్‌కు వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు సంస్థ ఉద్యోగులు, కార్మికులు ఘన స్వాగతం పలికారు. బాజిరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్‌ను కార్మికులు, ఉద్యోగులు సన్మానించారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ ఏర్పాటైందని.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెడుతుందని వెల్లడించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు వేతనం ఎంత పెరగనుంది? పీఎఫ్ ఎలా ఇస్తారు? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో ముఖాముఖి.