MLA Sandra : 'బీఆర్ఎస్ మార్క్ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం' - MLA Sandra Venkata Veeraiah
🎬 Watch Now: Feature Video
MLA Sandra Venkata veeraiah Interview : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ భారత్ రాష్ట్ర సమితి.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల రణక్షేత్రానికి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వినూత్న రీతిలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సండ్ర. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఆత్మీయ సమ్మేళనానికి తానే స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల జాబితా, లబ్ధిదారుల వివరాలు, ప్రభుత్వం కేటాయించిన నిధులు జాబితా మొత్తం కరపత్రం రూపంలో తయారు చేసి ప్రజలకు అందజేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఈటీవీ భారత్ ముఖాముఖిలో వెల్లడించారు.