Seasonal Diseases : రాష్ట్రంలో వర్షాలు.. సీజనల్ వ్యాధుల పట్ల జరంత జాగ్రత్త!
🎬 Watch Now: Feature Video
Seasonal Diseases During Rainy Season : చినుకు పడితే చాలు అనారోగ్యాలు ముసురుతుంటాయి. తాగు నీటిలో.. వరద నీరు కలిసి కలరా వంటి వ్యాధులకు దారి తీస్తుంటాయి. ఇక రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే మరో మూడు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు తమ ఆరోగ్యం పట్ల.. ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ఇటీవల డెంగీ కేసుల సైతం భారీగా పెరుగుతున్నాయి. ఇక టైఫాయిడ్, మలేరియా, ఫ్లూ కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. అయితే ఈ వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అత్యంత ముఖ్యమని వైద్యులు పేర్కొంటున్నారు. శరీరం నొప్పులుగా ఉండి బాగా నీరసిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. నీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున వేడి చేసుకుని తాగాలని.. ఆహారం విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని చెబుతున్నారు. ఇందుకోసం ఏం చేయాలి. ఎప్పుడు వైద్యులను సంప్రదించాలన్న అంశాలపై ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.