రాగల మూడు రోజులు చలి తీవ్రత పెరుగుతుంది - ఐఎండీ ఆఫీసర్ శ్రావణి ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 8:48 PM IST
IMD Officer Sravani Interview With Etv Bharat : రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదు అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, నగర పరిసర శివారు ప్రాంతాల్లో 12 డిగ్రీల నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వడం జరిగింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో రాత్రి పూట 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మిగిలిన ప్రాంతాల్లో మినిమమ్ టెంపరేచర్స్ నమోదు అయ్యాయి. పగటిపూట నుంచి తీసుకుంటే 21 డిగ్రీల నుంచి 31 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయింది. ఆ తరువాత సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. డిసెంబరు ఆఖరి వారం నుంచి చలి తీవ్రత పెరగడంతో పాటు శీతల వాయువులు వీస్తాయంటున్న శ్రావణితో ఈటీవీ భారత్ ముఖాముఖి.