I Love India Sand Art in Karimnagar : ' ఐ లవ్ ఇండియా'.. కరీంనగర్ వాసి అద్భుత సైకత శిల్పం - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 2023
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-08-2023/640-480-19270026-thumbnail-16x9-sand-art.jpg)
I Love India Sand Art in Karimnagar : రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజలు వివిధ రకాలుగా తమ దేశ భక్తిని చాటుతున్నారు. పెద్దపల్లి జిల్లా కుక్కల గూడూరుకు చెందిన రేవెల్లి శంకర్ అనే కళాకారుడు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దాదాపు 4 గంటల పాటు శ్రమించి 'ఐ లవ్ ఇండియా' అన్న సైకత శిల్పాన్ని రూపొందించారు. కేవలం బీచుల్లో మాత్రమే కనిపించే ఈ సైకత శిల్పాలను కరీంనగర్ మంకమ్మ తోటలో రేవెల్లి శంకర్ రూపొందిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇలా చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆయా పండుగల సందర్భంగానూ.. జన్మ దినాలను పురస్కరించుకొని రూపొందించే సైకత శిల్పాలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒడిశాలో సైకత శిల్పాన్ని రూపొందించారని పత్రికల్లో మాత్రమే చూసే వారమని.. ఇప్పుడు కరీంనగర్‌లోనూ ఇలా రూపొందించడం ఆనందంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.