Hyderabad customs police destroy drugs : 'రూ.950 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేశారు' - Hyderabad Latest News
🎬 Watch Now: Feature Video
Police destroy drugs in HWMP in Dundigal : మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు.. డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని హైదరాబాద్ కస్టమ్స్, డైరెక్టరెట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నాశనం చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ విదేశీ మార్కెట్లో దాదాపు రూ.950 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 23 రకాల మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను దుండిగల్‌లోని హైదరాబాద్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో (HWMP) లో అధికారులు నాశనం చేశారు. 409.39 కిలోల ఆల్ఫా జోలం, 2655.94 కిలోల గంజాయి, 142.93 కిలోల ఎపిడ్రిన్ హైడ్రో క్లోరైడ్, 11 కిలోల హెరైన్, 74.92 కిలోల కెటమైన్, 2.95 కిలోల మెఫిడ్రోన్, 53.98 కిలోల మెటక్విలోన్, 5595 కిలోల ఎఫిడ్రిన్ తయారీలో వాడే రసాయనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇందులో 18 రకాల మాదక ద్రవ్యాలను హైదరాబాద్ జోనల్ డైరెక్టరెట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకున్నారు.