ఆకతాయి ఒక్కడంట చిల్లరంత మూట గట్టి - దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్లలోన దొంగ దొంగ - కొల్చారం ఎల్లమ్మ ఆలయంలో హుండీ చోరీ
🎬 Watch Now: Feature Video
Published : Dec 5, 2023, 1:35 PM IST
Hundi Theft Yellamma Temple At Medak : మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని ఎనగండ్ల గ్రామంలో ఎల్లమ్మ గుడి తాళాలు ధ్వంసం చేసి దేవాలయంలో దొంగ చోరికి పాల్పడ్డాడు. ఆలయంలో చొరబడి హల్ చల్ చేశాడురు. ఇదంతా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. హుండీని పగలగొట్టి డబ్బులతో పాటు, ఇతర సామాగ్రిని కూడా ఎత్తుకెళ్లాడు. ఎత్తుకెళ్లిన సొమ్ము దాదాపుగా నాలుగు లక్షల వరకు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. ఈ గుడిలో చోరీ జరగడం ఈ నెలలో ఇది మూడోసారి అని చెప్పారు.
Hundi Theft Medak Yellamma Temple : ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నెల రోజులలో ఒకే ఆలయంలో మూడుసార్లు చోరీ జరిగిందని చెప్పినా కొల్చారం పోలీసులు పట్టించుకోకవడం గమన్హారం.