Huge Tree Collapse At Assembly Canteen : మొన్న హైదర్​గూడ, నేడు అసెంబ్లీ ప్రాంగణం.. నేలకొరిగిన భారీ వృక్షం.. కొద్దిలో..! - నేలకూలిన భారీ వృక్షం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 5:39 PM IST

Huge Tree Collapse At Assembly Canteen : హైదరాబాద్ అసెంబ్లీ క్యాంటీన్ ముందు ఉన్న భారీ వృక్షం(Tree Collapse) నేలకొరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా చెట్టు పడిపోయింది. క్యాంటీన్​లో తినడానికి వచ్చిన వారు.. వాహనాలను చెట్టు కింద పార్క్ చేసి వెళ్లారు. దీంతో ఆ చెట్టు.. నిలిపి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలపై పడింది. అమాంతం చెట్టు పడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.  

Huge Tree Fell Down in Hyderabad : ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపోవడంతో.. చెట్టు కింద ఉన్న వ్యక్తులు భయంతో పరుగులు తీశారు. తృటిలో ముగ్గురు వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే హైదర్​గూడలో భారీ వృక్షం కూలీ ఆటో డ్రైవర్ మృతి చెందిన విషయం మరువక ముందే ఈ సంఘటన జరగడంతో.. ఎప్పుడు ఏం అవుతుందో అని భాగ్యనగర వాసుల్లో ఆందోళన నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్​ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) డీఆర్​ఎఫ్ సిబ్బంది.. చెట్టును తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.