మీ సేవ ముందు బారులు తీరిన ప్రజలు - ఈ కేవైసీతో పాటు ఆధార్‌లో సవరణలు - Medak kyc update issue

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 2:28 PM IST

Huge Rush At Meeseva Center In Adilabad : ఆదిలాబాద్‌లోని మీ సేవ కార్యాలయం ముందు ప్రజలు బారులు తీరారు. ఈ కేవైసీ సమస్యతో పాటు, ఆధార్‌లో మార్పులు చేసుకోవడానికి ప్రజలు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఈనెల 28 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజా పరిపాలన కార్యక్రమంలో భాగంగా అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్న విషయం తెలిసిందే. వాటికిగానూ ఆధార్‌లో సవరణలకోసం ప్రజలు మీ సేవ వద్ద క్యూ కడుతున్నారు.

Huge Rush At HP Gas Centre in Medak :  మరోవైపు మెదక్ పట్టణంలోని హెచ్.పీ గ్యాస్ కేంద్రం వద్ద మహిళలు ఈ కేవైసీ కోసం బారులు తీరారు.  ఈ కేవైసీ కోసం ఎటువంటి కాలపరిమితి లేదని ఆధార్ కార్డు ఆధారంగా గ్యాస్ కనెక్షన్ నెంబర్ తీసుకొని బయోమెట్రిక్ తీసుకొని నవీకరించుకోవచ్చని గ్యాస్ మేనేజర్ రాజేష్ తెలిపారు. వినియోగదారులు అపోహలు నమ్మి ఏజెన్సీ వద్దకు రావద్దని సూచించారు. తమ డెలివరీ బాయ్స్ గ్రామ గ్రామానికి వచ్చి ఈ కేవైసీ చేస్తారని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.