ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు - Huge response to Prajavani program in Hyderabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-12-2023/640-480-20272915-thumbnail-16x9-prajavani--in--telangana.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 15, 2023, 12:06 PM IST
Huge Response to Prajavani Program in Hyderabad : ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వినతులు ఇవ్వడానికి తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. వాళ్ల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులకు అందించారు. వృద్ధులు, యువకులు, మహిళలు, వికలాంగులు పెద్ద సంఖ్యలో ప్రజావాణికి వచ్చారు.
Prajavani in Telangana : పింఛన్ రావడం లేదని, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయలేదని, ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని, వాహనాల పన్నును తగ్గించాలని ఇలా పలు సమస్యలతో దరఖాస్తుదారులు ప్రజావాణికి వచ్చారు. భర్త చనిపోవడంతో కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను తీసుకొని ప్రజాభవన్‌కు వచ్చింది. 2008 డీఎస్సీలో ఎంపికైనా ఉద్యోగం ఇవ్వలేదని, కోర్టు ఆదేశాలు జారీ చేసినా, గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని కొంతమంది అభ్యర్థులు తెలిపారు. విద్యుత్ శాఖలో ఉన్న ఆర్టిజన్లను పర్మినెంట్ చేయాలని మరికొంత మంది అభ్యర్థులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాభవన్ నుంచి లలితా జువెల్లర్స్ వరకు ప్రజలు బారులు తీరారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్దీకరించారు.