అద్దె చెల్లించలేదని ఈఎస్ఐ డిస్పెన్సరీ భవనానికి తాళం - అధికారుల హామీతో తెరుచుకున్న భవనం - మేడ్చల్‌లో ఇఎస్‌ఐ భవనం అద్దె ఘటన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 5:59 PM IST

House owner Locked ESI Building for Rent : ఈఎస్ఐ డిస్పెన్సరీ బిల్డింగ్​కు అద్దె చెల్లింపు చేయలేదని భవన యజమాని తాళం వేశారు. ఈ ఘటన మేడ్చల్ పట్టణంలో జరిగింది. ఈఎస్ఐ డిస్పెన్సరీ భవనానికి తాళం వేయడంతో చికిత్స కోసం వచ్చే రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడ్డారు. భవన యజమాని కృష్ణమూర్తికి 2022లో సెప్టెంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన అద్దె రాలేదని రెన్యువల్ చేసుకోలేదు. దీంతో ఆ రెండు నెలలతో పాటు మార్చి నుంచి అద్దె నగదు రావడం లేదు. ఈ కారణంగా యజమాని ఈఎస్​ఐ డిస్పెన్సరీ భవనానికి తాళం వేశారు. 

ఈ నేపథ్యంలో వైద్యం కోసం వచ్చే రోగులు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు. డిస్పెన్సరీ భవనం తెరుచుకునేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు, స్థానికులు మేడ్చల్​ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే మేడ్చల్ సీఐ నర్సింహా రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి అద్దె నగదు ఇప్పిస్తానని భవన యజమానికి సీఐ హామీ ఇచ్చారు. దీంతో యజమాని కృష్ణమూర్తి ఈఎస్​ఐ డిస్పెన్సరీ భవనానికి వేసిన తాళం తీశారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.