College Farewell Day in Secunderabad : 'పాకశాస్త్ర నిపుణుల కోసం ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోంది' - హైదరాబాద్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Hotel Management College Farewell Day in Secunderabad : మతిపొగొట్టే అందాలు.. మంత్రముగ్ధులను చేసే నృత్యాలతో విద్యార్థులు దుమ్మురేపారు. ఒకవైపు క్లాస్, మాస్ నృత్యాలు.. మరోవైపు అందమైన హంస నడకలతో అదరహో అనిపించారు. రీజెన్స్ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ ఫేర్‌వెల్ పార్టీ సికింద్రాబాద్‌లోని పైగా ప్యాలెస్‌లో కలర్‌పుల్‌గా సాగింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులు తమ అనుభవాలను తోటి విద్యార్థులతో పంచుకున్నారు. పాకశాస్త్ర నిపుణుల కోసం ప్రపంచ దేశాలు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని రీజెన్స్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల హెచ్‌వోడీ ఉమ తెలిపారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రంగంలో పెరిగాయని తెలిపారు. మూడేళ్లే కలిసి చదువుకొని.. ఈరోజు వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటే బాధగా ఉందని విద్యార్థులు అంటున్నారు. కలిసి చదువుకున్న ఈ మూడేళ్లు కళాశాల వారికి ఎన్నో మధురానుభూతులను అందించిందన్నారు. ఇవాళ విడిపోతున్నామంటే మరో రోజు కలుసుకోవడానికే అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.