రూ.30వేలు పలుకుతున్న కోడి ధర! స్పెషల్ ఏంటంటే? - 30 వేలకు కోడిని అమ్మిన భవానీ బిస్వాల్
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 10:47 PM IST
|Updated : Dec 12, 2023, 10:57 PM IST
Hen Costs 30000 In Odisha : సాధారణంగా కోడి ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఓ రెండు వందలో, మూడు వందలో ఉంటుంది. కానీ ఒడిశాలోని బాలేశ్వర్‌లో మాత్రం ఓ వ్యక్తి పెంచిన కోడి ధర అక్షరాల 30 వేల రూపాయలు పలుకుతోంది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. అసలు విషయమేమింటే?
బాలేశ్వర్‌లోని అనంతపుర్ ప్రాంతంలో భవానీ బిస్వాల్ అనే యువకుడు ఇంట్లో కోళ్లను పెంచుకుంటూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే తెలుగురాష్ట్రాల్లో లాగా ఆ ప్రాంతంలో కూడా సంక్రాంతి పండుగకు కోళ్ల పందేలను నిర్వహిస్తుంటారు. ఏటా సంక్రాంతికి ముందు పందెం కోళ్లకు మంచి డిమాండ్ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
కోడి పందేళ్లలో ప్రత్యర్థులను ఓడించాలంటే బలమైన కోళ్లు అవసరం. అందువల్ల మయూర్భంజ్ బైషింగాకు చెందిన కొందరు వ్యక్తులు అనంతపుర్లోని భవానీ బిస్వాల్ వద్ద ఉన్నాయని తెలుసుకుని కొనుగోలు చేయడానికి వచ్చారు. ఆ సమయంలో భవానీ బిస్వాల్ పందెం కోడి ధర రూ.30 వేలుగా చెప్పారు. దీంతో వారు రూ.30వేలు కన్నా తక్కువ ధరకే ఇవ్వాలని భవానీ బిస్వాల్‌ను అడిగారు. అందుకు బిస్వాల్ నిరాకరించగా వారు వెనుదిరిగారు. పందెంలో ఈ కోడి కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం ఉందని వారు తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు కోడిని చూడటానికి వచ్చారు.