thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 6:26 PM IST

ETV Bharat / Videos

Heavy Rain in Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షం.. ఇబ్బందులు పడ్డ వాహనదారులు

Heavy Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది.  కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో వాన ముంచెత్తింది. భారీగా కురిసిన వర్షంతో రహదారులపై వెళ్తున్న వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్​, మియాపూర్, మాదాపుర్, గచ్చిబౌలి, అశోక్ నగర్​, శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్ మెట్​ తదితర ప్రాంతాల్లో వర్షం(Rain) పడింది. వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి. 

Heavy rain in Hyderabad Surroundings : నగరంలో కురిసిన వర్షం వల్ల సదురు ప్రాంతాల్లో ట్రాఫిక్​కి అంతరాయం కలిగింది. గుంతలు ఉన్న ప్రాంతాల్లో రహదారులు చెరువులు మాదిరిగా తయారయ్యాయి. రాష్ట్రంలో వానలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.