గాలివాన బీభత్సం... ఎలా ఉందో మీరే చూడండి! - Wind disaster in Motkuru of Yadadri Bhuvanagiri
🎬 Watch Now: Feature Video
Heavy rain by gusty winds in Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మున్సిపల్ కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి ఇళ్ల పైకప్పులు, పాఠశాల ప్రహరీ గోడ కూలడం, చెట్లు, స్తంభాలు కుప్పకూలాయి. ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో చెట్టు కూలి ప్రహరీ గోడ మీద పడడంతో... అది కూలి ద్విచక్రవాహనంపై పడింది. దీంతో ఆ బైక్ ధ్వంసం అయ్యింది. ఇండ్ల పై కప్పు రేకులు లేచిపోయి... వస్తువులపై పడ్డాయి. కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు కూలిపోయి రోడ్డు మీద పడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారిపై చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పంట నేలకోరిగింది. మామిడి తోటలో కాయలన్నీ రాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్ారు.