తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ - 2నెలల్లో తేల్చాలని సీబీఐ కోర్టుకు ఆదేశం - టీఎస్ హైకోర్టు న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 7:51 PM IST

HC on AP CM Jagan Illegal Assets Case: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రెండు నెలల్లో తేల్చాలని సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. జగన్‌పై సీబీఐ, ఈడీ కేసుల విచారణ వేగం పెంచి ఏపీ ఎన్నికల్లోపు తేల్చాలంటూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ 11, ఈడీ కేసులు 9 డిశ్చార్జి పిటిషన్ల దశలో ఉన్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ సమర్పించిన నివేదికలో తెలిపారు. డిశ్చార్జి పిటిషన్లను రెండు నెలల్లో తేల్చాలని ఆదేశిస్తూ విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. 

High Court Orders on CM Jagan Embezzlement Case: మరోవైపు సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. మొత్తం 20 కేసుల్లో నిందితులు వేసిన 130 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ప్రక్రియ ముగిసింది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్లు, అప్పీళ్లు, స్టే పిటిషన్లు వేసినట్లయితే అవి ఏ దశలో ఉన్నాయో తెలపాలని నిందితులు, సీబీఐ, ఈడీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా వేసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.