Harish Rao on BRS Manifesto : 'బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి.. విపక్షాల గుండెలు బేజారు' - బీఆర్ఎస్ మేనిఫెస్టో
🎬 Watch Now: Feature Video
Published : Oct 16, 2023, 7:42 PM IST
Harish Rao on BRS Manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టోను చూసి.. విపక్షాల గుండెలు జారిపోయాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక కుటుంబ పెద్దగా ఆలోచించిన కేసీఆర్.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించారన్నారు. నేడు రాష్ట్రంలో అర్హులైన 44 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని.. ప్రజల గురి ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు.
Harish Rao Fires on Congress : తమ పథకాలను కాపీ చేశారంటున్న రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన రైతుబంధు, దళితబంధు, ఫించన్లను కాపీ కొట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. నేడు రాష్ట్రంలో ఎలాంటి దరఖాస్తు పెట్టకుండానే రైతుబంధు నిధులు ఇస్తున్నామని.. ప్రతి ఇంటికి ధీమా కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ బీమా తీసుకొస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథతో.. మహిళలు దశాబ్దాల పాటు అనుభవించిన మంచినీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ సర్కారేనని పేర్కొన్నారు. రేపు సిద్దిపేటలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సభ ఏర్పాట్లపై నిర్వహకులకు పలు సూచనలు చేశారు.