ఫ్రీగా హనుమాన్ మూవీ టికెట్ల పంపిణీ - ఎక్కడో తెలుసా? - Free Tickets Distribution in TS
🎬 Watch Now: Feature Video


Published : Jan 14, 2024, 4:07 PM IST
Hanuman Movie Free Tickets Distribution : ధర్మ పరిరక్షణ కోసం కావాల్సిన శక్తిని హనుమంతుడు ఇస్తాడనే సందేశంతో ఇటీవల విడుదలైన సినిమా హనుమాన్ ద్వారా ప్రజలకు తెలియజేశారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. హనుమాన్ సినిమాను ఇవాళ సికింద్రాబాద్ టివోలి థియేటర్లో దిల్లీ పబ్లిక్ విద్యా సంస్థల అధినేత కొమరయ్యతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 22న జరగనుందని గుర్తు చేశారు. ఈ సమయంలో హనుమాన్ మూవీ రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
Hanuman Movie Latest News : మరోవైపు కొమరయ్య హనుమాన్ సినిమా వెయ్యి టికెట్లను కొనుగోలు చేసి ప్రేక్షకులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇలాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ నెల 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది.