Hakimpet Sports School OSD on Harrassment Allegations : నిజానిజాలు తేలాక సస్పెండ్ చేస్తే బాగుండేది: ఓఎస్డీ హరికృష్ణ - Medchal District News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 14, 2023, 10:25 AM IST

Hakimpet Sports School OSD on Harrassment Allegations : హకీంపేట్​ క్రీడా పాఠశాలలో తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై.. విచారణ జరపకుండా వెంటనే సస్పెండ్ చేయడంపై మాజీ ఓఎస్డీ హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ అనంతరం.. తప్పు చేసినట్లుగా రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత సస్పెండ్ చేస్తే బాగుండేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తేలితే.. జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని హరికృష్ణ ప్రశ్నించారు. తన వ్యక్తిత్వం గురించి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు తెలుసన్నారు. క్రీడా పాఠశాలకు తాను వచ్చాక మెడల్స్ సంఖ్య పెరిగిందని.. తన గురించి తూంకుంట చుట్టుపక్కల ప్రజలను, ప్రజాప్రతినిధులు ఎవరిని అడిగినా చెబుతారని పేర్కొన్నారు. ఈ ఘటనతో తమ కుటుంబ పరువు పోయిందని.. ఆయన భార్య వాపోయారు.

మరోవైపు.. మాజీ ఓఎస్డీ హరికృష్ట పాఠశాల నుంచి వెళ్లిపోతుండగా.. కొందరు విద్యార్థులు ఆయన కారును అడ్డుకున్నారు. తమను వదలి వెళ్లిపోవద్దని కన్నీరు పెట్టుకున్నారు. హరికృష్ణ తమకు తండ్రి లాంటివారని.. ఆయనపై ఆరోపణలు రావడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.