భూతగాదాలో తండ్రీకొడుకుల కాల్పులు.. మహిళ పరిస్థితి విషమం - ఫైరింగ్
🎬 Watch Now: Feature Video
రెండు కుటుంబాల మధ్య భూతగాదాలు కాల్పులకు దారితీశాయి. ప్రత్యర్థి కుటుంబంపై తండ్రీకొడుకులు కాల్పులు జరిపిన ఘటన మధ్యప్రదేశ్, గ్వాలియర్‌లోని మోహనా పోలీస్ స్టేషన్ పరిధి రెహట్ చరాయీ గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బఘేల్ కుటుంబంలో వారసత్వ భూమి వివాదం కొనసాగుతోంది. ఛత్రపాల్ బఘేల్ అనే వ్యక్తి ఆ భూమిలో పనులు చేస్తుండగా ఇంటి పక్కనే ఉండే హకీమ్ సింగ్ బఘేల్, అతడి కొడుకు అక్కడికి వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. అందుకు ఛత్రపాల్ ఒప్పుకోలేదు. దీంతో ఇంటి డాబాపైకి ఎక్కి హకీమ్ సింగ్, అతడి కొడుకు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఛత్రపాల్ సింగ్ భార్య మీనాకు వెన్నులో తూటా తగిలింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడిని అపహరించి అడవిలోకి పారిపోయారని ఆరోపించారు ఛత్రపాల్. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST