ETV Bharat / offbeat

నోరూరించే తెలంగాణ స్టైల్ "వంకాయ పచ్చికారం" - వేడివేడి అన్నం, జొన్న రొట్టెల్లోకి కిర్రాక్ కాంబినేషన్! - VANKAYA PACHI KARAM RECIPE

ఎప్పుడూ రొటీన్ కర్రీలే కాదు - ఓసారి ఇలా వంకాయ పచ్చికారాన్ని ట్రై చేయండి!

Telangana Style Vankaya Pachi Karam
Vankaya Pachi Karam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Telangana Style Vankaya Pachi Karam Recipe : చాలా మంది ఇష్టంగా తినే రెసిపీలలో ఒకటి గుత్తొంకాయ. అయితే, మీరు ఇప్పటి వరకు వంకాయతో ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఓసారి ఇలా తెలంగాణ స్టైల్​లో "వంకాయ పచ్చికారం" ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్​ అద్భుతంగా ఉండి.. తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • తెల్ల గుత్తొంకాయలు - 8 నుంచి 10
  • పల్లీలు - పావు కప్పు
  • మెంతులు - పావు చెంచా
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • తెల్ల నువ్వులు - 1 టేబుల్​స్పూన్
  • నూనె - పావు కప్పు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఆనియన్ పేస్ట్ కోసం :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్​ది)
  • పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
  • పసుపు - అరటీస్పూన్
  • పచ్చికొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
  • పెరుగు - పావు కప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే, గుత్తొంకాయలను శుభ్రంగా కడిగి తొడిమె వైపు కాకుండా కింది వైపు నుంచి నాలుగు భాగాలుగా చీల్చుకొని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని మెంతులు, పల్లీలను వేసి మంచిగా వేయించుకోవాలి. అవి వేగాక జీలకర్ర వేసుకొని వేయించాలి. ఆ తర్వాత నువ్వులు కూడా వేసి చిటపటమనే వరకు వేయించుకొని దింపేసుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్​ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మళ్లీ స్టౌపై అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఆనియన్స్​లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమం, పసుపు, పచ్చికొబ్బరి ముక్కలు, పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్​ వేసుకోవాలి. ఆపై తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయలను వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద అవి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి.
  • వంకాయలు మెత్తగా మగ్గాయనుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, పల్లీల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత 200ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
  • అయితే, మిశ్రమాన్ని మరీ దగ్గరగా మారేంత వరకు ఉడికించుకోకుండా కాస్త జారుడుగా ఉన్నప్పుడే కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తెలంగాణ స్టైల్ "వంకాయ పచ్చికారం" రెడీ!
  • దీన్ని వేడివేడి అన్నం, జొన్నరొట్టెలు, చపాతీలు ఇలా దేనిలోకి తిన్నా ఆ టేస్ట్ వేరే లెవల్​లో ఉంటుంది. మరి, నచ్చిందా అయితే మీరు ఓసారి ఈ స్టైల్​లో వంకాయ కర్రీని చేసుకోండి!

ఇవీ చదవండి :

లేత వంకాయలతో "కమ్మని గుజ్జు కూర" - మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే!

చూస్తేనే నోరూరిపోయే "వంకాయ పచ్చడి" - ఈ కొలతలతో చేసుకున్నారంటే అద్భుతః అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.