ETV Bharat / entertainment

'ఇండియన్ 2 రిజల్ట్​ అస్సలు ఊహించలేదు - గేమ్ ఛేంజర్ విషయంలో అలా జరగదు' - SHANKAR ABOUT INDIAN 2 RESULT

ఇండియన్ 2 నెగిటివ్ రివ్యూస్​పై డైరెక్టర్ శంకర్ రిప్లై - 'ఆ రిజల్ట్ నేను రిజల్ట్​ అస్సలు ఊహించలేదు'

Shankar About Indian 2 Result
Indian 2 Director Shankar (ETV Bharat, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 1:29 PM IST

Shankar About Indian 2 Result : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం 'గేమ్​ ఛేంజర్' రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా గురించి కీలక విషయాలు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులోభాగంగా తన గత చిత్రం 'ఇండియన్‌ 2' రిజల్ట్‌ గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమా ఫలితాన్ని తాను ఊహించలేదని పేర్కొన్నారు.

"ఇండియన్‌ 2' సినిమాకు ఇలా నెగిటివ్‌ రివ్యూలు వస్తాయని నేను అసలు అనుకోలేదు. కానీ, ఫర్వాలేదు. ఇప్పుడు రానున్న'గేమ్‌ ఛేంజర్‌', 'ఇండియన్‌ 3' సినిమాలతో నేను ఎక్స్​ట్రార్డినరీ వర్క్‌ను మూవీ లవర్స్​కు అందించనున్నాను. దీన్ని చూసి ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌ అవుతారని భావిస్తున్నాను. సోషియో పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా 'గేమ్‌ ఛేంజర్‌' రూపొందింది. ఓ ప్రభుత్వ అధికారికి, పొలిటికల్ లీడర్​కి మధ్య జరిగే యుద్ధంలా ఈ సినిమను చూపించనున్నాం" అని శంకర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, 'గేమ్‌ ఛేంజర్‌' విషయంలో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు శంకర్‌ తెలిపారు. " ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాం. ఆ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇది. తన లుక్‌, స్టైల్‌, యాక్షన్‌, డైలాగ్స్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని విషయాల్లోనూ చరణ్ ఎంతో అద్భుతంగా మెరిశారు. ఇదొక ఫుల్​ లెంగ్త్​ మాస్‌ కమర్షియల్‌ కంటెంట్‌" అని శంకర్ అన్నారు.

కియారా అడ్వాణీ కథానాయికగా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, అంజలి కీలకపాత్రలు పోషించారు. రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక 'ఇండియన్‌ 2' సినిమా విషయానికి వస్తే కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌ హాసన్‌, సిద్ధార్థ్​, ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్​లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. 1996లో విడుదలైన 'ఇండియన్‌' చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుని ఈ ఏడాది జులై 12న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్నీ బాషల్లోనూ మిక్స్​డ్​ టాక్​తోనే సరిపెట్టుకుంది.

'నన్ను ఎవరూ అంచనా వేయలేరు' - రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్' టీజర్‌ వచ్చేసిందోచ్

'గేమ్​ఛేంజర్​లో సూర్య పాత్రకు థియేటర్లలో పేపర్లు పడతాయి' - Game Changer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.