సాగర్​పై ఏపీ పోలీసులు దౌర్జన్యంగా మోహరించారు : గుత్తా సుఖేందర్‌రెడ్డి - Comments on Gutta Sukender Reddy Sagar

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 2:20 PM IST

Gutta Sukender Reddy Comments on AP Govt : తెలంగాణ రాష్ట్రం శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉన్న సమయంలో నాగార్జున సాగర్‌ ఆనకట్టపై ఏపీ పోలీసులను ఆ రాష్ట్ర సర్కార్ దౌర్జన్యంగా మోహరించిందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. సాగర్​ గేట్లను తెరిచి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి 5,000 క్యూసెక్కుల నీటిని తరలించడం చాలా త్రీవమైన అంశం అని గుత్తా మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని ధ్వజమెత్తారు.  

Gutta Sukender Reddy Fires On AP Police : ఆంధ్రప్రదేశ్​ పునర్విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్​ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని సుఖేందర్​ తెలిపారు. ఉభయ రాష్ట్రాల నీటి డిమాండ్​ విషయంలో కృష్ణా రివర్​ బోర్డ్​ మేనేజ్​మెంట్​కు తెలియజేశామని వెల్లడించారు. అక్టోబర్​, జనవరి, ఏప్రిల్​ నెలలో ఐదు టీఎంసీలు ఆంధ్రపదేశ్​కు​ కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని గుత్తా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.