Farewell to OU CI Ramesh : ఓయూ సీఐకి విద్యార్థుల ఘన వీడ్కోలు.. పలువురి భావోద్వేగం - telangana latest news
🎬 Watch Now: Feature Video
Great Farewell to OU CI Ramesh : విద్యాబుద్ధులు నేర్పిన గురువులు బదిలీ అయినప్పుడు విద్యార్థులు ఆత్మీయ వీడ్కోలు పలకటం సహజం. స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ బదిలీ అయితే అక్కడి విద్యార్థులు గురువులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన విధంగా.. సీఐ అధికారికి ఆత్మీయంగా వీడ్కోలు పలికిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ సీఐకి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ అధికారికి విద్యార్థులు, పోలీస్ సిబ్బంది గొప్ప వీడ్కోలు ఇచ్చారు.
ఓయూ పోలీస్ స్టేషన్లో వివిధ హోదాల్లో పని చేసిన సీఐ రమేశ్‌కు బదిలీ ఉత్తర్వులొచ్చాయి. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సంఘాలకు అతీతంగా విద్యార్థులు, పోలీసులు కలిసి బాజాభజంత్రీలతో, పూలు చల్లుతూ, నృత్యాలతో వీడ్కోలు పలికారు. సీఐ రమేశ్‌ను ఓపెన్ టాప్ జీపులో యూనివర్సిటీలో ఊరేగించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు.
TAGGED:
farewell to ou ci ramesh