రాజ్‌భవన్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు - రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు
🎬 Watch Now: Feature Video
Published : Jan 13, 2024, 11:45 AM IST
Governor Tamilisai Celebrates Sankranti At Raj Bhavan : తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం దిల్లీ పర్యటన వెళ్తున్నానని ఇది రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్‌లో సంక్రాంతి వేడుకలను గవర్నర్ తమిళిసై ఘనంగా ప్రారంభించారు. రాజ్‌భవన్‌లోని ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు.
Sankranti Celebrations In Rajbhavan : హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఈ వేడుకలో పాల్గొని ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అవుతుందని అందుకే ఈ సంక్రాంతి పండుగ అందరికి ప్రత్యేకమేనని చెప్పారు. రామ్ మందిర్ పాటను తెలుగు, హిందీలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.