బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగంపైనా రాజకీయాలు చేస్తున్నారు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 7:13 PM IST

Government Whip Adi Srinivas Visit to Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగదని, ఇప్పటివరకు అమలు కాని కొత్త సంక్షేమ పథకాలను తీసుకొచ్చి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ విప్​గా ఎన్నికై సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ఆయన​కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పట్టణంలోని పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల చేయూత కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్లు భ్రమలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధికి నోచుకోని పథకాలను కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని అమలు చేసే దిశగా కృషి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపైనా రాజకీయాలు చేస్తున్నారన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.