మేకకు దైవభక్తి.. దేవుడి సన్నిధిలో తలవంచి ప్రార్థనలు!.. వీడియో వైరల్ - ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. బాబా ఆనందేశ్వర్ ధామ్ ఆలయంలో ఓ మేక దేవుడికి నమస్కరిస్తోంది. ఆలయ గర్భగుడి వద్ద మోకాళ్లపై నిల్చొని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కనిపించింది. సాధారణ భక్తుడిలాగే ఈ మేక ఇలా చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేక ఇంతకుముందు కూడా ఆలయం దగ్గర ఇలానే చేసిందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు.. మేకలను దానం ఇస్తుంటారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST