యాదాద్రి భువనగిరిలో తాటిచెట్టుపై గుండెపోటుతో గీతకార్మికుడి మృతి - Gita Worker heart attack in Yadadri
🎬 Watch Now: Feature Video
Published : Jan 17, 2024, 5:24 PM IST
Gita Worker Died Due to heart attack In Yadadri Bhuvanagiri : గీతకార్మికులకు ప్రతి రోజు తాటి చెట్లు ఎక్కడంతో రోజు మొదలవుతుంది. కల్లు తీసి అమ్మడం ద్వారా వారి జీవనం సాగుతుంది. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కొందరు కాలు జారి పడి గాయాల పాలైతే, మరికొందరు కింద పడి అక్కడిక్కడే మరణిస్తారు. తాజాగా ఓ గీత కార్మికుడు చెట్టుపైనే గుండెపోటుతో మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
Gita Worker Died On Palm Tree : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కుర్ మున్సిపాలిటీ కేంద్రంలోని రాజన్నగూడెంకు చెందిన సుధగాని లక్ష్మయ్య (68) తాటిచెట్టుపైనే గుండెపోటుతో మృతి చెందాడు. తాడి చెట్టుపై వేలాడు ఉన్న గీతకార్మికున్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని జేసీబీతో చెట్టుపై నుంచి కిందకు దింపి పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతునిపైనే ఆధారపడిన కుటుంబసభ్యులకు ప్రభుత్వం గీతకార్మికులకు అందించే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని స్థానికులు అధికారులను కోరారు.