Child Missing In Karimnagar : కరీంనగర్లో చిన్నారి మిస్సింగ్ కలకలం.. 3 రోజులైనా దొరకని ఆచూకీ - కరీంనగర్ బాలిక మిస్సింగ్
🎬 Watch Now: Feature Video
3 Years Girl Child Missing in Karimnagar : కరీంనగర్లో మధ్యప్రదేశ్‌కు చెందిన మూడేళ్ల చిన్నారి అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీళ్లంతా నిర్మాణ పనుల కోసం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ నుంచి వలస వచ్చి కరీంనగర్‌లోని రాంనగర్ సమీపాన జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 27న మూడేళ్ల చిన్నారి కృతిక అదృశ్యం అయింది. తల్లిదండ్రులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నా చిన్నారి ఆచూకీ మాత్రం చిక్కడం లేదు.
చిన్నారి ఇంటి నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలోనే చిన్నారి బయటకు వెళ్లడంతో ఎక్కడైనా వరద నీటిలో చిక్కుకుని ఉంటుందా.. లేక ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.