గ్యాస్ సిలిండర్ లీకై మంటలొస్తున్నాయా? - ఇలా చేస్తే ప్రమాదాన్ని అరికట్టొచ్చు? - gas cylinder leakage
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 2:06 PM IST
|Updated : Jan 3, 2024, 2:30 PM IST
Gas Cylinder Leakage at Home : నేటి కాలంలో గ్యాస్బండలేని ఇళ్లు లేదు. ప్రతిరోజు వంటగ్యాస్ వినియోగం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో గ్యాస్ వినియోగంలో చిన్న చిన్న తప్పిదాలు పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇళ్లు వదిలి బయటికి వెళ్లినా ఓసారి గ్యాస్ బండపై దృష్టి వేయాల్సిందే. తిరిగి వచ్చాక కూడా మరోసారి అటువైపు చూడాల్సిందే. అయితే గ్యాస్ సిలిండరే కదా అని నిర్లక్ష్యం ఉంటే మూల్యం చెల్లించే అవకాశం ఉంటుంది.
Gas Cylinder Leakage Precautions : గ్యాస్ ప్రమాదాల్లో ప్రాణనష్టంతో పాటుగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవిస్తోంది. సదరు కుటుంబానికే పరిమితం కాకుండా ఇరుగుపొరుగు వారూ ఈ ప్రమాదంలో బలవుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఆందోళన చెందక తప్పదు. ఈ నేపథ్యంలో గ్యాస్ లీకేజీ అవుతున్నప్పుడు ఏం చేయాలి? లీకేజీ కారణంగా మంటలు చెలరేగితే ఏం చేయాలి, సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించాలి? గ్యాస్ నుంచి వెలువడే మంటలను ఏ విధంగా అరికట్టాలి? వంటి అంశాలపై అగ్నిమాపక శాఖ అధికారులు, నిపుణులతో ముఖాముఖి.