బోల్తా కొట్టిన కారు - బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి, ఎక్కడంటే? - సంగారెడ్డి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 2, 2023, 12:46 PM IST
Ganja seized in Sangareddy : రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయి వెళ్తున్న ఓ కారులో గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ఉన్న వారు తీవ్రంగా గాయపడగా కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో భారీగా ఉన్న గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు.
Two Tonnes Ganja Seized In Sangareddy : కారులో లభ్యమైన గంజాయి సుమారు 2 క్వింటాళ్ల వరకు ఉంటుందని, దాని విలువ రూ.25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారుతో సహా అందులో దొరికిన గంజాయిని చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.