Ganesh Gold Laddu in Hyderabad : బొజ్జ గణపయ్య బంగారు లడ్డూ వేలం.. ఎంత ధర పలికిందంటే..? - హైదరాబాద్లో బంగారు లడ్డూ వేలం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-09-2023/640-480-19601022-thumbnail-16x9-gold-ganesh-laddu.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 25, 2023, 1:23 PM IST
Ganesh Gold Laddu Velam Pata in Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి మండపం దగ్గర భక్తుల సందడితో ఆహ్లాదంగా మారుతోంది. గణపతి ఉత్సవాల్లో విగ్రహా ప్రతిష్టించడం, నిమజ్జనం ఎంత వైభవంగా చేస్తారో.. అలానే లడ్డూ వేలపాట కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. ఓ మండపంలోని వినాయకుని లడ్డూని బంగారంతో తయారు చేశారు. దీంతో భక్తులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.
Vinayaka Chavithi Celebrations in Telangana హైదరాబాద్లోని నారాయణగూడ పరిధిలోని స్ట్రీట్ నెం.5లో వినాయకుడి చేతిలో ప్రత్యేకంగా తులం బంగారంతో చేసిన లడ్డూ(Gold Laddu)ను పెట్టారు. నిమజ్జనం రోజు నిర్వహకులు 15 కిలోల లడ్డూతో కలిపి దాన్ని వేలం వేశారు. ఈ పాట రూ.1,116తో మొదలయింది. భక్తులు ఆ లడ్డూని పొందేందుకు అధిక సంఖ్యలో పాల్గొని.. వేలం పాటను ఆసక్తిగా మలిచారు. చివరికి హిమాయత్నగర్కి చెందిన సంధ్యారాణి రూ.1.36 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం బొజ్జ గణపయ్యని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగించారు. డీజే పాటలు, తీన్మార్ డాన్స్లు మధ్య సందడిగా గణపతిని భక్తులు నిమజ్జనం చేశారు.