live video: బార్లో స్నేహితుడిపై దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు - బార్లో ఫైట్
🎬 Watch Now: Feature Video
live video: మద్యం సేవిస్తుండగా తలెత్తిన వాగ్వాదం ఇద్దరి స్నేహితుల మధ్య గొడవకు దారితీసింది. నవీన్, చక్రి ఇద్దరు స్నేహితులు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బార్‌కు వెళ్లారు. ఇద్దరు మద్యం సేవిస్తుండగా మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో నవీన్‌పై చక్రి మద్యం సీసాలతో దాడి చేశాడు. నవీన్ తలకు తీవ్రగాయాలు అవడంతో స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST