Flood Water Flowing in Chinthal : నీటమునిగిన చింతల్.. ఇళ్లలోకి చేరిన వరద నీరు - చింతల్లో భారీ వర్షాలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 5, 2023, 7:23 PM IST
Flood Water Flowing in Chinthal : తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్, ఇంద్రసింగ్ నగర్లో వరద నీరు(Flood Water) భారీగా ప్రవహిస్తోంది. కొన్ని ఇళ్లలోకి సైతం వరద నీరు చేరింది. చింతల్, ఇంద్రసింగ్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో సెల్లార్లోకి నడుము లోతు నీరు రావడంతో అందులో పార్క్ చేసి ఉన్న పలు వాహనాలు పాడయ్యాయి. సెల్లార్లోకి నీరు రావడంతో తమ ఇంట్లో సామన్లు, వంట సామాగ్రి, బట్టలు అన్ని నీటిలో మునిగి పోయాయని కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Heavy Rain in Chinthal : నాలాలలో పేరుకుపోయిన చెత్తను సరిగ్గా తీయక పోవడం వలనే ఇలాంటి దుస్థితి వచ్చిందని అపార్ట్మెంట్ వాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చింటే చాలు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని వాపోతున్నారు. ఇంద్రసింగ్ నగర్ అంటేనే జలమయంలా ఉందంటున్నారు. ఉదయం నుంచి ఇళ్లల్లోకి నీరు చేరిన ఇప్పటికీ అధికారులు వారి వద్దకు రాలేదని చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా వరద ప్రాంతాల్లో దృష్టి పెట్టాలని కోరుతున్నారు.