నిజామాబాద్‌లో వేడెక్కిన రాజకీయం.. కాకరేపుతోన్న పోటాపోటీ ఫ్లెక్సీలు..! - ఎంపీ అర్వింద్
🎬 Watch Now: Feature Video
Flexi War in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో రాజకీయం వెేడెక్కింది. రెండు రోజుల నుంచి ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన పసుపు బోర్డు హామీపై శుక్రవారం నిజామాబాద్ నగరంలో పసుపు రంగులో ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. వాటికి ప్రతిగా నిన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌తో పాటు నిజామాబాద్ నగరంలో పసుపు రంగు ఫ్లెక్సీలు పెట్టిన ప్రతి చోటా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అయితే తాజాగా నవీపేట్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరోసారి కలకలం రేపుతున్నాయి.
నిన్న ఏవిధంగా అయితే బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎండగడుతూ ఫ్లెక్సీలు ఉన్నాయో.. నవీపేట్లోనూ అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు సంబంధించిన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు, 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం, ఎన్‌ఆర్‌ఐ సెల్, ఉచిత ఎరువులకు సంబంధించి వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇవి చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు రోజులుగా వెలసిన ఫ్లెక్సీలను జిల్లా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే శనివారం పలు ప్రాంతాల్లోని ఫ్లెక్సీలను కొందరు చించేశారు.