Fishing in Medivagu At Mulugu : వాగుకు ఎదురీదుతున్న భారీ చేపలు.. పోటీపడి మరీ పట్టుకున్న గ్రామస్థులు - Telangana latest news
🎬 Watch Now: Feature Video
Fishing in Ramappa Lake At Mulugu : అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి నిండుకుండల వలే మారాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి ములుగు సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న మేడివాగుకు వరదలు పోటెత్తాయి. ఎగువన కురిసిన వర్షాలకు కుంటలు చెరువులు మత్తలు పడి వరదలు రామప్ప సరస్సులోకి చేరడంతో సరస్సులో ఉన్న చేపలు వరద నీటిలో ఎదురెక్కాయి. దీంతో జంగాలపల్లి, ఇంచర్ల, ములుగు, బరిగలపల్లి చుట్టుపక్కల గ్రామస్థులు వలలు పట్టుకొని చేపల వేటకు సిద్దమయ్యారు. వరదకు ఎదురుగా వలలు వేస్తూ చేపలు పట్టేందుకు పోటీపడ్డారు. వలల్లో పెద్దపెద్ద చేపలు పడటంతో సంతోషం వ్యక్తం చేశారు. సుమారు ఒక్కొక్క చేప 10కిలోలపైనే ఉంటుందని యువకులు చెబుతున్నారు. జాతీయ రహదారి కావడంతో కొందరు వాహనదారులు సైతం వాటిని కొనడానికి ఆసక్తి చూపారు. తక్కువ ధరతో పాటు తొలకరి వరదలకు ఎదురెక్కిన చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని కొందరు చేపలు కొనేందుకు పోటీపడ్డారు. మరి కొందరు చేపల వేటను ఆసక్తిగా తిలకించారు.